Friday, May 3, 2024

పాక్ అడ్మినిస్ట్రేటీవ్ స‌ర్వీసెస్‌కు ఎంపికైన హిందూ యువతి..

పొరుగుదేశం పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి అత్యున్న‌త స్థాయి ఉద్యోగాల్లో నియామ‌కం కావ‌డం అంటే అంత‌టి సుళువైన విష‌యం కాదు. అడుగ‌డుగున ఎదుర‌య్యే అడ్డంకుల‌ను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాంటి సాహ‌సం చేసి చ‌రిత్ర సృష్టించింది స‌నా రాంచంద్ గుల్వానీ.  పాకిస్తాన్‌లోని అత్యున్న‌త ఉద్యోగ‌మైన అడ్మినిస్ట్రేటీవ్ స‌ర్వీసెస్‌కు ఎంపికైంది.  దీనికోసం జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో మొద‌టిసారికే విజ‌యం సాధించింది స‌నా.  ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగువేయ‌గ‌లిన‌పుడే త‌ప్ప‌కుండా అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తామ‌ని స‌నా చెప్ప‌క‌నే చెప్పింది.  పాక్‌లోని హిందువుల‌కు ఆమె ఇప్పుడు రోల్ మోడ‌ల్‌గా మారింది.  ఈ ఏడాది జ‌రిగిన సెంట్ర‌ల్ సుపీరియ‌ర్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో దేశ‌వ్యాప్తంగా కేవలం 2 శాతం మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే విజ‌యం సాధించారు. 

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 24న బైడెన్, మోడీ సమావేశం..

Advertisement

తాజా వార్తలు

Advertisement