Tuesday, April 30, 2024

Break – విశాఖ‌కు కార్యాలయాల త‌ర‌లింపు – హైకోర్టు బ్రేక్

విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. కాగా, అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ పిటీషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్ట్ చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ లోపు పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్ట్ న్యాయమూర్తి తెలిపారు.

రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోరారు.. దీంతో. తదుపరి విచారణను హైకోర్టు గురువారం కి వాయిదా వేసింది. నేడు మరోసారి విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మసనానికి బదిలీ చేసింది.. ఆ ధర్మాసనం తీర్పు వచ్చే వరకూ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్త‌ర్వులు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement