Saturday, May 4, 2024

టైటిల్ పెట్ట‌లేదు.. రిలీజ్ డేట్ మాత్రం చెప్పేశారు

తన తదుపరి చిత్రంపై హీరో వైష్ణవ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్ హీరోగా సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో వైష్ణవ్ కు జంటగా యువ నటి శ్రీలీల నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 29న సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఉప్పెన’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్, ఈ మధ్య వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ బాటలో ఉన్న శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement