Sunday, April 28, 2024

ప్ర‌కృతి చికిత్సాల‌యం హాస్ప‌ట‌ల్ ని సంద‌ర్శించిన.. సోనూసూద్

ప్ర‌కృతి చికిత్సాల‌యం హాస్ప‌ట‌ల్ ని సంద‌ర్శించాడు న‌టుడు సోనూసూద్. ఈ ఆసుప‌త్రి హైద‌రాబాద్ లో ఉంది. కాగా ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ కాటేజీలు, మెస్, యోగా ప్రాంగణాన్ని పరిశీలించారు సోనూసూద్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరుచాలా బాగుందని పేర్కొన్నారు. రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోనూసూద్ తో పాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయూష్ కమిషనర్ ప్రశాంతిలతో పాటు నేచర్ క్యూర్ హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.ఈ సందర్బంగా వైద్యులు, విద్యార్థులతో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. సోనూసూద్ సంపంగి మొక్కను నాటారు. సోనూసూద్ తో సెల్ఫీల కోసం అక్కడ ఉన్నవారంతా పోటీపడ్డారు. అనంతరం వైద్యులు, విద్యార్థులను ఉద్దేశించి సోనూసూద్ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement