Thursday, May 2, 2024

Hero Nikhil – డ్ర‌గ్స్ తీసుకోవ‌డం మ‌ర‌ణంతో స‌మానం …

హైద‌రాబాద్ – డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలతో టాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది. ఆయ‌న లిస్ట్ లో సినీ,క్రీడా,రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉండ‌టంతో ఏ క్ష‌ణంలో ఎవ‌రిని అరెస్ట్ చేస్తారోన‌న‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో నేడు హైద‌రాబాద్ లోడ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. ఇందులో పాల్గొన్న హీరో నిఖిల్ మాట్లాడుతూ, డ్ర‌గ్స్ తీసుకోవ‌డం అంటే మ‌ర‌ణంతో స‌మాన‌మ‌ని వ్యాఖ్యానించాడు..


డ్రగ్స్ తీసుకోవాలంటూ గతంలో తనకు చాలాసార్లు ఆఫర్ చేశారని నిఖిల్ వెల్లడించాడు. కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని స్పష్టం చేశాడు. డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. త్వరలోనే తెలంగాణ, భారతదేశం మాదకద్రవ్యాల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నానని తెలిపాడు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఇతర మార్గాల్లో జీవితాన్ని ఆస్వాదించడంపై దృష్టి సారించాలని నిఖిల్ సూచించాడు. ప్రయాణాలు చేయండి, విహారయాత్రలకు వెళ్లండి, సైక్లింగ్ చేయండి… ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడండి, సినిమాలు చూడండి… అంతేతప్ప మత్తుకు బానిసలు కావొద్దు అని సలహా ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement