Tuesday, May 21, 2024

భార్య‌కి గిఫ్ట్ గా ఎన్టీఆర్ ఫామ్ హౌస్ – బృందావ‌నం పేరు పెట్టిన హీరో

గ‌త ఏడాది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంక‌ర్ ప‌ల్లి మండ‌లానికి చెందిన గోపాల‌పురం గ్రామ ప‌రిధిలో 6న్న‌ర ఎక‌రాల భూమిని కొన్నాడు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవసాయ భూమిలో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ ని నిర్మించారట. ఆ ఫామ్ హౌస్ ని తారక్ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ ఆ ఫామ్ హౌస్ కి ‘బృందావనం’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. కంప్లీట్ గ్రీన్ గ్రాస్, చెట్లతో ఎంతో అందంగా ఆ ఫామ్ హౌస్ ఉంటుందట.

దీనితో బృందావనం అనే పేరు ఫామ్ హౌస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని తారక్ భావించాడు. బృందావనం పేరు వినగానే ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ గుర్తుకు వస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో, క్లోజ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు, పార్టీలు గట్రా చేసుకునేందుకు తారక్ ఈ ఫామ్ హౌస్ ని ఉపయోగిస్తున్నారట. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలకు ఫామ్ హౌస్ లు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement