Friday, May 17, 2024

మాధవన్ కి కరోనా..అమీర్ ఖాన్ కి ట్యాగ్ చేశాడు..

సినీ పరిశ్రమను కరోనా వదలడం లేదు. వరుసగా నటీనటులు ఈ మహామ్మారి భారీన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‏ ఈ వైరస్ భారీన పడగా.. తాజాగా మరో హీరోకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నటుడు మాధ‌వ‌న్‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని అత‌డే త‌న ట్వీట్ ద్వారా చెప్పాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‏తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఫన్నీ కామెంట్ పెట్టాడు.  ఇప్ప‌టికే ఆమిర్ ఖాన్‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలుసు క‌దా. ఫ‌ర్హాన్.. రాంచోని ఫాలో కావాల్సిందే. వైర‌స్ ఎప్పుడూ మా వెంటే ప‌డేవాడు. కానీ ఈసారి దొరికిపోయాం. కానీ అంతా బాగానే ఉంది. కొవిడ్ తొంద‌ర్లోనే పోతుంది. క‌నీసం ఇక్క‌డైనా రాజు మ‌మ్మ‌ల్ని ఫాలో అవ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను అని మాధ‌వ‌న్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మాధవన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement