Monday, April 29, 2024

తిరుచ్చిలో షూటింగ్ ఛాంపియ‌న్ షిప్ పోటీలు-బంగారు..కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్న హీరో అజిత్ టీం

త‌మిళ స్టార్ హీరో అజిత్ కి బైక్ రైడ్ అంటే ఎంత ఇష్ట‌మో షూటింగ్ అంటే కూడా అంతే ఇష్ట‌మ‌ట‌. వివ‌రాల్లోకి వెళ్తే..ప్ర‌స్తుతం తిరుచ్చిలో 47 త‌మిళ‌నాడు రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియ‌న్ షిప్ పోటీలు జ‌రుగుతున్నాయి. ఈ పోటీల‌కు త‌మిళ స్ట‌ర్ హీరో అజిత్‌, అత‌డి టీం కూడా పాల్గోంది. కాగా ఈ పోటీల్లో అజిత్ టీం నాలుగు బంగారు, రెండు కాంస్య ప‌త‌కాల‌ను గెలుచుకుంది. గ‌తేడాది కూడా అజిత్ చెన్నైలో జ‌రిగిన షూటింగ్ ఛాంపియ‌న్ షిప్‌లో 6 బంగారు ప‌త‌కాల‌ను గెలుచుకున్నాడు. ఇలా 50 ఏళ్ళ వ‌య‌సులోనూ అజిత్ క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించ‌డంతో త‌మ హీరోను ప్ర‌శంసిస్తూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అజిత్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement