Wednesday, May 22, 2024

నెరిసిన జుట్టు..గ‌డ్డంతో హీరో అజిత్ సెకండ్ లుక్

హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు త‌మిళ స్టార్ హీరో అజిత్. ఇప్పటినుండే అజిత్‌ పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా విడుదలై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు.ఈ సెకండ్‌లుక్‌లో నెరిసిన జుట్టు, గడ్డంతో.. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మాస్‌లుక్‌లో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చాడు. ఈ చిత్రం అవుట్‌ అండ్ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ ఫిలింగా తెరకెక్కనుంది. ఈ మూవీకి తునివు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. జీ-స్టూడీయోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్‌ అడ్వేంచర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు.ఈ చిత్రంతో పాటు ఇంకా మూడు సినిమాలు అజిత్ చేతిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement