Thursday, May 2, 2024

UP Assembly elections: అఖిలేశ్ యాదవ్ ఆస్తులు రూ.40 కోట్లు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.40 కోట్లుగా ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లా కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆయనపై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను బీజేపీ పోటీలో దింపింది.

సోమవారం అఖిలేశ్ యాదవ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు, మొత్తం ఆస్తుల విలువ రూ. 40 కోట్లుగా ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 8.43 కోట్ల నగదును వివిధ బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్ రూపంలో కలిగి ఉన్నారు. అలాగే, 17.93 ఎకరాల భూమి కూడా ఆయన పేరిట ఉంది. అలాగే, ఆయనకున్న వ్యవసాయేతర భూమి విలువను రూ.17.22 కోట్లుగా ఆయన ప్రకటించారు. బ్యాంకు రుణానికి సంబంధించి రూ.28.97 లక్షలు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అఖిలేశ్ యాదవ్ తనకు రూ.83.98 లక్షలు, భార్య డింపుల్ యాదవ్ రూ.58.92 లక్షల చొప్పున వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement