Thursday, May 2, 2024

National: మధ్యప్రదేశ్‌లో హేయ‌మైన ఘ‌ట‌న‌…34 ఏళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో హేయ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. 34 ఏళ్ల గర్భిణిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు నిప్పంటించారు. బాధితురాలు ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మొరెనా జిల్లా అంబాహ్ పట్టణానికి సమీపంలోని చాంద్ కా పురా గ్రామంలో చోటుచేసుకుంది.

- Advertisement -

అంబాహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అలోక్ పరిహార్ తెలిపిన వివరాలు ప్ర‌కారం… తన భర్త మీద అత్యాచార ఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు ఆ గర్భిణి చాంద్ కా పురా గ్రామానికి వెళ్లింది. ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ, ఈ ముగ్గురు కలిసి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గర్భిణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆ,ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలు గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తనపై ముందుగా సామూహిక అత్యాచారం చేసి, ఆపై ముగ్గురు పురుషులు కలిసి నిప్పంటించారని బాధితురాలు వీడియోలో పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితురాలైన మహిళ భర్త గతంలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement