Saturday, April 27, 2024

మూడు రోజులపాటు భారీ వర్షాలు..

ఏపీ, తెలంగాణ‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగాల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో శనివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షంతో రహదారులపై మోకాలులోతు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి చెరువులు నీటితో నిండి జలకళను తలపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement