Monday, April 29, 2024

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు.. రెండురోజుల పాటు తీవ్రత.. రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిక..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందే అవకాశం ఉందని విపత్తుల నివారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సోమవారం ఈ మేరకు విడుదల చేసింది.మంగళవారం 26, బుధవారం 69 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. ఎండ , వడగాల్పుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉన్న మండలాల వివరాలనువెల్లడించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా లోని అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం మండలాలు వున్నట్లు తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, సీతానగరం, గోకవరం, కోరుకొండ అలాగే ఏలూరు జిల్లాలో కుకునూర్‌, కాకినాడ జిల్లాలో గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, పార్వతిపురంమాన్యం జిల్లాలో గరుగుబిల్లి, జియమ్మవలస, కొమరాడ, వీరఘట్టం మండలాలలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

బుధవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల వివరాలను వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 8, తూర్పు గోదావరి 6, ఏలూరు 3, గుంటూరు 3, కాకినాడ 4, కృష్ణా 1, నంద్యాల 1, ఎన్టీఆర్‌ 9, మన్యం 7, శ్రీకాకుళం 2, విశాఖ 1, విజయనగరం 13, వైయస్సార్‌ 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement