Sunday, April 28, 2024

HBD – ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే – హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు నుంచి కొత్త పోస్ట‌ర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రాల్లో హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి కంచె ఫేమ్ క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. కాగా ఇప్పటికే విడుదలైన‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఇదిలా ఉండ‌గా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా హరి హర వీరమల్లు నుంచి న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గడ్డంతో ఉన్న పవన్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఇక‌ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ రూ. 150 -200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement