Thursday, May 9, 2024

ఆధ్యాత్మిక అనుభూతికి లోన‌య్యా.. త‌మ‌న్నా

ప్రేమ వ్య‌వ‌హారంతో సోష‌ల్ మీడియాలో నిలుస్తోంది హీరోయిన్ త‌మ‌న్నా. హీరో నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయింది. వీళ్ళిద్దరూ తరచుగా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా మాత్రం తమ రిలేషన్ ని బయట పెట్టడం లేదు. ప్రస్తుతం తమన్నా వయసు 33 ఏళ్ళు. దీనితో ఈ హాట్ బ్యూటీ పెళ్ళికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. త‌మ‌న్నా ఇటీవల తరచుగా ప్రసిద్ధ ఆలయాలు సందర్శించి అక్కడ పూజలు చేస్తోంది. ఇటీవల తమన్నా హిమాలయాల్లోని వైష్ణవి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. తాజాగా తమన్నా ఇషా యోగ సెంటర్ లో శక్తివంతమైన లింగభైరవి దేవికి పూజలు నిర్వహించింది. కాషాయ వస్త్రాలు ధరించిన తమన్నా దీక్షలో ఉంటూ ఈ పూజలు చేసింది. ఇక్కడా పూజలు చేస్తుంటే ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు తమన్నా పేర్కొంది. తరచుగా తమన్నా పూజలు చేస్తుండడంతో ఆసక్తికర ప్రచారం మొదలయింది. తమన్నా పెళ్లికి రెడీ అవుతోంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement