Saturday, April 20, 2024

రుద్రంగి మూవీలో దివి ఫోక్ డ్యాన్స్…

.’బాహుబలి’, ‘ఆర్‌.ఆర్‌. ఆర్‌’ చిత్రాలకు రచయితగా చేసిన అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ఈ సిని మాలోని ముఖ్య పాత్రలను పరి చయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన ఈ టీమ్‌ తాజాగా ఫోక్‌ పాటని విడుదల చేశారు. ”జాజిమొ గులాలి… ” అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు ఆలపించారు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి ఇందులో నటించింది. ఒకవైపు తన అందాలతో అలరిస్తూనే ఫోక్‌ సాంగ్‌ బీట్‌ కి భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ లో అద్భుతంగా డాన్స్‌ చేసింది దివి. పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాట అభినయ శ్రీనివాస్‌ అందించగా సంగీతం నాఫల్‌ రాజా అందించారు. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ హంగులతో శాసనసభ్యుడు, కళాకారుడు రసమయి బాలకిషన్‌ నిర్మిస్తుండగా జగపతి బాబు, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహందాస్‌, కాలకేయ ప్రభాకర్‌, ఆర్‌ఎస్‌ నంద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement