Monday, April 29, 2024

హర్యానాలోనూ ఆప్‌ తుపాను.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

హర్యానా రాజకీయాల్లో తుపాను సృష్టించబోతున్నామని, ఢిల్లి, పంజాబ్‌లలో మొదలైన తుపాను ఇప్పుడు హర్యానాలోనూ ప్రభావం చూపబోతోందని ఆప్‌ సారథి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. నిన్న ఇక్కడ గాలివాన వచ్చిందని తెలిసిందని, ఇది శుభసంకేతమని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ సృష్టించే రాజకీయ తుపానుకు ఇది సంకేతమని ఆయన అన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సభతో ఆయన 2024 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. ఢిల్లిdలో విద్యా,వైద్య వ్యవస్థలకు కొత్తరూపు తెచ్చామని, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచామని, అందుకే రెండోసారి ఆప్‌కు అధికారం దక్కిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లిdలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఇప్పుడు పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చామని, అక్కడ కూడా అవినీతిని చెండాడుతూ విద్యారంగాన్ని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎవరైతే తమ పిల్లలను అల్లరివారిగాను, విధ్వంసకులుగాను, గూండాలుగాను చూడాలనుకుంటున్నారో వారిని బీజేపీలోకి పంపిచొచ్చని ఎద్దేవా చేశారు.

ఢిల్లిలో ఈ ఏడాది 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పేరుమోసిన ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు పొందారని చెప్పారు. ఈ ఏడాది 99.7 శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పారు. హర్యానాలో ఆప్‌కు అవకాశం ఇస్తే ఇక్కడ కూడా విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తమ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా ఉన్నతస్థానానికి చేరుకోవాలనుకునే తల్లిదండ్రులంతా ఆప్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.యువత ఉద్యోగాలతో స్థిరపడకూడదన్నది బీజేపీ ఆలోచన అని, వారికి కావలసింది పనిలేకుండా తిరిగే కుర్రకారని, వారితో రాజకీయాలు నడపడమే లక్ష్యమని ఆరోపించారు. ఢిల్లిలో తన నివాసంపై జరిగిన బీజేపీ దాడిని అందుకు ఉదాహరణగా కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. హర్యానాలో పరీక్షలు నిర్వహించలేని మనోహర్‌ ఖట్టర్‌ ఇక ప్రభుత్వాన్ని ఎలా నడపగలరని ప్రశ్నించారు. తమకు అధికారం ఇస్తే వైద్య, విద్యుత్‌ రంగాలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఖట్టర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ము బీజేపీకీ ఉందా అని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement