Monday, May 6, 2024

కృష్ణ బ‌ర్త్ డే – ఎమోష‌నల్ ట్వీట్ చేసిన త‌న‌యుడు మ‌హేశ్ బాబు

నేడు సీనియ‌ర్ న‌టుడు కృష్ణ పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు ..సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. మీలాంటివారు నిజంగా ఎవరు లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.లవ్ యూ.. అని ట్వీట్ చేశారు. అలాగే కృష్ణ కోడలు, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.” మీతో గత కొన్నేళ్లుగా మాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, నవ్వు, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య. మేము నిన్ను ప్రేమిస్తున్నాం అని నమ్రత పోస్ట్ చేశారు. టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కృష్ణ‌కి విషెష్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement