Monday, May 6, 2024

హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ నాన్న‌-సాయికుమార్ కి త‌న‌యుడి విషెష్

మ‌ల్టీటాలెంటెడ్ న‌టుడు సాయికుమార్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సాయికుమార్ త‌న‌యుడు..సోద‌రుడితో పాటు మెగాస్టార్ చిరంజీవి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెప్పారు. సుమ‌న్‌, అమితాబ్ వ‌చ్చ‌న్‌, రాజ‌శేఖ‌ర్‌, ర‌జినీకాంత్‌, అర్జున్‌సార్జా, విజ‌య్ కాంత్‌, విష్ణు వ‌ర్ద‌న్‌, సురేశ్ గోపీ, మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ లాంటి స్టార్ హీరోల‌కు ఆయా భాష‌ల్లో సాయికుమార్‌ వాయిస్ ఓవ‌ర్‌ అందించారు. సాయికుమార్ సోద‌రులు ర‌విశంక‌ర్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, కుమారుడు ఆది కూడా యాక్ట‌ర్లుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న యాక్టింగ్, డైలాగ్ డెలివ‌రీ, డ‌బ్బింగ్ స్టైల్‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న సాయికుమార్ . ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు సాయికుమార్‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ ప్ర‌త్యేక‌మైన రోజును పుర‌స్క‌రించుకుని కుటుంబ‌స‌భ్యులు సాయికుమార్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. హ్యాపీ బ‌ర్త్ డే టూ యూ..డియ‌ర్ బాబూ..నాన్న‌’ అంటూ సాయికుమార్‌కు ఓ వైపు సోద‌రుడు ర‌విశంక‌ర్ , మ‌రోవైపు కుమారుడు ఆది పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. నాకు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెప్పిన చిరంజీవి ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అని వీడియో సందేశంలో తెలిపారు సాయికుమార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement