Wednesday, May 1, 2024

పాడు బడ్డ ఇళ్లు, బెగ్గర్స్ గుడిసెల్లో గుట్కా నిల్వలు.. ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తున్న స్మగ్లర్లు..

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) ఓరుగల్లులో గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెట్టి గుట్కా స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికేతర వ్యాపారులు రంగంలోకి దిగి, వరంగల్ కమిషనరేట్ పోలీసుల కళ్ళు గప్పి ,గుట్టుగా చీకటి దందాకు తెరలేపారు. గుట్కా వ్యాపారంలో ఇప్పుడున్న పద్ధతికి భిన్నంగా గుట్కా దందా సాగించే వ్యుహ్య రచన సాగించేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కిరాణం, పాన్ షాప్ యజమానుల నుండి ప్రభుత్వ నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల ఆర్డర్లు తీసుకొని, అక్రమ రవాణా ద్వారా స్టాక్ రాగానే ఆగమేఘాల మీద షాప్స్ కు చేరవేస్తున్నారు.అంతేగాక ఇంకా మిగిలి ఉన్న గుట్కా, పొగాకు ఉత్పత్తులను పాడు బడ్డ బంగ్లాలు, బెగ్గర్స్ నివశించే పూరి గుడిసెలో గుట్కా,పొగాకు ఉత్పత్తుల నిల్వలను భద్ర పరుస్తూ,పోలీసుల కంటబడకుండ పక్కా ప్రణాళికతో చీకటి వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. గుట్కా స్మగ్లర్లు చేస్తున్న చీకటి దందాపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ శ్రీనివాస్ జీ కి పక్కా సమాచారం అందుకున్నారు. శ్రీనివాస్ జీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం కొత్తవాడ బస్టాప్ సమీపంలో నిషేధిత గుట్కా నిల్వలను అక్రమంగా నిల్వ చెందిన గుట్కా స్మగ్లర్ల డెన్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఈ దాడితో నిషేధిత గుట్కా సరఫరా, పంపిణీ చేస్తున్న గ్యాంగ్ గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంంధించిన పూర్తి వివరాలను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జీ పత్రికలకు వివరాలు విడుదల చేశారు.10 లక్షల 69 వేల రూపాయల గుట్కా నిల్వలను సీజ్ చేశామని చెప్పారు.మొత్తం 40 గుట్కా సంచులను స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వరంగల్‌లోని గోపాలస్వామి టెంపుల్ బస్టాప్ సమీపంలో హైదరాబాద్ మీర్ పెట్ కు చెందిన దుబ్బా విక్రమ్ ను పట్టుకున్నారు. పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని కిరణం దుకాణాలు, పాన్‌షాప్‌ల నుండి ఆర్డర్లు తీసుకొని, భారీగా గుట్కా డంప్ కలిగి ఉన్న చాంద్రాయణగుట, హైదరాబాద్‌ కీ చెందిన చిగలపల్లి రమేష్ అలియాస్ రాములు ఇంటికి వెళ్ళి, అతని నుండి గుట్కా సేకరించిన తర్వాత విక్రమ్ ఆర్టీసీ బస్సులో ఎక్కి గమ్యస్థానాలకు చేరవేస్తాడు. ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం అయిన రాములు ను కూడ అరెస్ట్ చేషారుఖ్, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గుట్కా ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. రాములును విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు షాకింగ్ న్యూస్ బయట పడ్డాయి. బీదర్ నుంచి గుట్కాను భారీగా తెచ్చుకుని హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం మట్వాడ పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement