Monday, April 29, 2024

Gun Culture – అమెరికాలో మళ్ళీ పేలిన తుపాకీ – చిన్నారితో సహా ముగ్గురు హత్య

అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రెగిపోతుంది. చికాగోలోని రోమియోవిల్లే ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబాన్ని దుండగులు కాల్చి చంపారు. చికాగోలో సబర్బన్‌ హోమ్‌లో నివశిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులతోపాటు వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మూడు కుక్కల్ని ఘోరంగా కాల్చి చంపారని న్యూయార్స్‌ పోస్ట్‌ నివేదించింది.

ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రోమియోవిల్లే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారు ఆల్బర్ట్‌ రోలన్‌, జోరైడా బార్టోలోమీ, ఆడ్రియల్‌ (10), డియోగో (7)గా పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి యజమాని పనికి వెళ్లకపోవడం..బంధువుల నుండి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కి స్పందించకపోవడంతో.. బంధువులే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులకు అనుమానమొచిచ్చి ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో హత్య జరిగిన ఇంటిని తనిఖీ చేశారు. అప్పుడే ఆ ఇంట్లో భార్యాభర్తలతో సహా, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పోలీసులకి కనిపించాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement