Sunday, April 28, 2024

Gun Culture – జార్జియాలో తుపాకీ మోత – న‌లుగురు బ‌లి..

జార్జియా: అమెరికా జార్జియాలోని హెన్రీ కౌంటిలో ఉన్న హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరణించినవారిలో ముగ్గురు పరుషులు, ఓ మహిళ ఉన్నరు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడినికోసం ముమ్మరంగా గాలిస్తున్నామని హాంప్టన్‌ పోలీస్‌ చీఫ్‌ జేమ్స్‌ టర్నర్ వెల్లడించారు.

హాంప్టన్ చెందిన 40 ఏండ్ల వయస్సున్న ఆండ్రీ లాంగ్‌మోర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. అతడి గురించి సమాచారం అందించినవారికి 10 వేల డాలర్లు రివార్డు ప్రకటించారు. నలుపు రంగులో ఉన్న జీఎంసీ అకాడియా ఎస్‌యూవీలో అతడు తప్పించుకుని ఉండొచ్చని చెప్పారు. అతని ఫొటోను అధికారులు విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement