Saturday, April 27, 2024

GT vs MI | ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్ ఎంతంటే

అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌ జట్టు ముంబై ముందు ఊరించే టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల చేసింది. కాగా, సాయి సుద‌ర్శ‌న్ (45), కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్(35)లు రాణించ‌గా.. చివ‌ర్లో ర‌హుల్ తెవాటియా(22) ప‌రుగులు సాధించ‌డంతో గుజ‌రాత్‌కు పోరాడ‌గ‌లిగే స్కోర్ అందించాడు.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో గెరాల్డ్ కోట్జీ రెండు, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయ‌గా.. పియూష్ చావ్లా ఒక వికెట్ ప‌డ‌కొట్టాడు. కాగా, 169 పరుగుల టార్గెట్‌తో ముంబై ఇండియన్స్‌ బిరిలోకి దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement