Thursday, April 25, 2024

CSK vs GT | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజ‌రాత్..

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవ్వాల (మంగ‌ళ‌వారం) చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక చెన్నై హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.

కాగా, ఇటు చెన్నై అటు గుజరాత్ జట్లు తమ తమ తొలి మ్యాచుల్లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. చెపాక్ లో జరిగిన ఆరంభ పోరులో బెంగళూరును చిత్తు చేసింది చెన్నై జట్టు.. మరోవైపు గుజరాత్ కూడా తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ముంబైని ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంతో ఉన్నాయి. అయితే, నేటి మ్యాచ్‌లో గెలిచిన ఏ జట్టుకైనా ఇది రెండో విజయం కానుంది.

జ‌ట్ట వివ‌రాలు..

గుజరాత్ టైటాన్స్ :

డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా (WK), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, శుభమాన్ గిల్ (c), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్

చెన్నై సూపర్ కింగ్స్ :

- Advertisement -

రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా.

Advertisement

తాజా వార్తలు

Advertisement