Thursday, April 25, 2024

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు : మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా గోవింద రావుపేట మండలంలోని మన ఊరు – మన బడి కింద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 50 లక్షల 60 వేల రూపాయలతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ది పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే మన బస్తీ మన బడి లక్ష్యం.. రాష్ట్రంలో 26,095 సర్కార్ బడుల రూపురేఖలు మార్చే గొప్ప కార్యక్రమం మన ఊరు – మన బడి అన్నారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి అని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడిని ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూ.7289 కోట్లతో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మన ఊరి – మన బడి అన్నారు. పేదలకు విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించనున్నమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులతో ఎర్పాటు చేస్తున్నామని అన్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 సర్కార్ బడులలో రూ.7289 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని ఒకవైపు బోధన, మరోవైపు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పిల్లలు పుస్తక పఠనంతో పాటు నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మన ఊరు-మన బడి వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయని, ఇక నుండి మరింత బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా కలెక్టర్, ఐటిడిఏ పీఓ, ఎస్పీ ఇతర అధికారులు స్కూల్స్ ను దత్తత తీసుకుని పర్యవెంక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి హరి బాబు, సర్పంచ్ లావుడ్యా లక్ష్మీ, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడిఏ పీఓ అంకిత్, జిల్లా ఎస్పీ గౌస్ అలమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement