Thursday, April 25, 2024

జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరులో జరిగాయి. కరోనాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల కాలాన్ని మూడుసార్లు తగ్గించింది. అయితే, ఈసారి వర్షాకాల సమావేశాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని కేంద్రం భావిస్తోంది. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర సిబ్బంది కనీసం ఒక కరోనా వ్యాక్సిన్ డోసైనా తీసుకున్నారని పార్లమెంటు అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో  జులైలోనే పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement