Monday, December 9, 2024

పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో 8.5 శాతం వడ్డీ జమ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీని జమ చేయబోతోంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో గత మార్చిలో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించింది. ఇది ఏడేళ్ళలో కనిష్ట వడ్డీ రేటు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.65 శాతం ఉండేది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2016-17లో 8.65 శాతం ఉండేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీని జూలై నెలాఖరుకు జమ చేసేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలాఖరుకు దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందబోతున్నారు. భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా 8.5 శాతంగా ఉంచిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఖాతాల నుంచి సొమ్మును ఉపసంహరించుకునేవారు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement