Tuesday, April 30, 2024

“ఐస‌ర్” లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవకాశాలు : వినోద్‌ కుమార్‌..

కేంద్రం ప్రభుత్వ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌) కోర్సుల్లో అడ్మిషన్లకు ఇంటర్‌ విద్యార్థులకు గొప్ప అవకాశాలు ఉన్నాయిని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జాతీయ సైన్స్‌ డే సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ జలీల్‌తో వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. బీఎస్‌, ఎంఎస్‌ కోర్సుల్లో చేరేలా విద్యార్థులను సమాయత్తం చేయాలని సూచించారు. ఐసర్‌ అటానమస్‌ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆప్‌ ఎడ్యు కేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు. బెర్హంపూర్‌, భోపాల్‌, కోల్‌ కతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఐసర్‌ సంస్థలు ఉన్నాయని చెప్పారు.

ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ తర్వాత ఇంజనీరింగ్‌.. మెడిసిన్‌ మాత్రమే ఉంటాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ, ఏఐఐఎంఎస్‌ స్థాయిలో ఐసర్‌ విద్యా సంస్థను కేంద్రం స్థాపించిందని తెలిపారు. విదేశాల్లో చదివే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంఎస్‌ తరహాలో ఐసర్‌ ద్వారా బీఎస్‌, ఎంఎస్‌ కోర్సులు మంచి ప్రాధాన్యం ఉందని తెలిపారు. సైన్స్‌రంగంలో ఆయా కోర్సులకు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో మెరుగైనా అవకాశాలుంటాయన్నారు. సైన్స్‌ కోర్సులకు ఎప్పటికీ ప్రాధాన్యం ఉంటుందని, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement