Saturday, May 4, 2024

BGMI | గేమ‌ర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే ఇండియాలో బీజీఎంఐ రీ లాంచ్

దేశంలో PUBG గేమ్‌ నిషేధం తర్వాత భారతీయ గేమర్‌ల కోసం ప్రత్యేకంగా BGMI వీడియో గేమ్ లాంచ్ అయ్యింది. ఈ గేమ్‌ను ఆడేవారి సంఖ్య ఏడాదిలోపే 100 మిలియన్లను దాటిపోయింది. అయితే.. గత ఏడాది జులైలో సెక్యూరిటీ రీజ‌న్స్ కార‌ణంగా BGMI కూడా బ్యాన్ చేశారు. ఆ తర్వాత Apple యాప్ స్టోర్, Google Play Storeలో BGMI యాప్ కనిపించకుండా పోయింది. కాగా, లేటెస్ట్ అప్డేట్ ఎంటంటే.. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) మ‌ళ్లీ దేశానికి తిరిగి రాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. BGMI త్వరలో ప్లే-స్టోర్‌లో అందుబాటులోకి రానుంద‌ని గేమ్ మాతృ సంస్థ క్రాఫ్టన్ వెల్ల‌డించింది. దేశంలో BGMI తిరిగి రావడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు దక్షిణ కొరియా దిగ్గజం క్రాఫ్టన్ ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించింది. BGMI తిరిగి రావడంతో పాటు గేమ్ లో చాలా మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. ఒక వినియోగదారు ఎన్ని గంటలు గేమ్‌ను ఆడగలరో గేమ్‌కు సమయ పరిమితి ఉండ‌నుంది.

ఇక‌.. ఆటలో రక్తం రంగు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులోకి మార్చే చాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. “బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించినందుకు మేము భారతీయ అధికారులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కొన్ని నెలలుగా మా భారతీయ గేమింగ్ కమ్యూనిటీకి వ‌చ్చిన‌ మద్దతు, సహనానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా త్వరలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వస్తుంది’’., అని క్రాఫ్టన్ ఇండియా CEO సీన్ హ్యూనిల్ సోహన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement