Tuesday, April 30, 2024

చెన్నై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టీమ్ లో జాయిన్ అవ్వ‌నున్న స్టార్ బౌల‌ర్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త అందింది. సీఎస్‌ కే స్టార్‌ బౌలర్‌ కమ్‌ ఆల్‌ రౌండర్‌.. జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వేలంలో.. ఏకంగా రూ.14 కోట్లు పెట్టి ఈ ఆట‌గాన్ని దక్కించుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. అతడి సేవల కోసం ఎదురు చూస్తోంది. ఈ సీజన్ లో ఆడిన‌ తొలి రెండు మ్యాచ్‌ ల్లోనూ ఓడిన చెన్నై.. ఆదివారం పంజాబ్‌ తో జరిగే.. మూడో మ్యాచ్‌ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో.. ఉంది.

ఈ నేపథ్యంలో దీపక్‌ చాహర్‌ నెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టడం ఆ జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. డెత్‌ ఓవర్లలో చాహర్‌ లాంటి పేసర్‌ లేని లోటు తొలి రెండు మ్యాచ్‌ల్లో చెన్నైకి చాలా స్పష్టంగా క‌నిపించింది. గత సీజన్‌లో చెన్నై విజేతగా నిలవడంలో.. కీలక పాత్ర పోషించిన దీపక్‌ చాహర్‌.. ఇటీవల వెస్టిండీస్‌తో జ‌రిగిన‌ టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు చాహ‌ర్. ఆ తర్వాత బెంగళూరులోని ఆకాడమీలో ఫిట్‌నెస్‌ టెస్టుల కోసం ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement