Thursday, April 18, 2024

నిరసనల వారం.. కేంద్రంపై టీఆర్​ఎస్​, రాష్ట్రంపై కాంగ్రెస్.. పోరుకు రెడీఅంటున్న పాలిట్రిక్స్​

భ‌గ్గుమంటున్న ఎండ‌లు.. కిందామీదా సుర్రుమ‌నే వేడి తీవ్ర‌త‌ను ఏమాత్రం లెక్క చేయకుండా పొలిటిక‌ల్ పార్టీలు పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారమంతా నిరసనలకు దిగాలని నిర్ణ‌యించుకున్నారు ఆ పార్టీ లీడ‌ర్లు. వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రంపై పోరుకు అధికార టీఆర్ ఎస్ పార్టీ సన్నద్ధం కాగా.. విద్యుత్తు చార్జీల పెంపు, పెట్రో ధ‌ర‌లు తగ్గించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలు చేప‌ట్ట‌నుంది. మొత్తానికి ఈ వారం నిరసనల వారంగా మారబోతోంది..

ఉమ్మడి రంగారెడ్డి (ప్రభ న్యూస్ బ్యూరో) : పెట్రో చార్జీల మూతను మొదలుకొని విద్యుత్తు చార్జీలు పెరిగిపోయాయి. ఎండ లతోపాటు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. వాయు వేగంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు కొనసాగుతోంది.  యాసంగిలో వరి సాగు తగ్గింది. ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని తెరాస ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కేంద్రం పై తెరాస వారం రోజులపాటు యుద్దాన్ని మెదలు పెట్టింది. గ్రామం నుండి ఢిల్లీ వరుకు పోరుకు సిద్దమైంది. కేంద్ర..రాష్ట ప్రభుత్వా లపై కాంగ్రెస్ యుద్దాన్ని మెదలెట్టనుండి. రెండు పార్టీలు ఒకే రోజు పోరుకు శ్రీకారం చుట్టనున్నాయి.

మండలంలో ప్రారంభమై ఢిల్లీ లో ముగింపు..

వడ్ల కొనుగోలు పై తెరాస ప్రభుత్వం కేంద్రంపై యుద్దాన్ని మెదలెట్టింది. ఈనెల 4వ తేదీ నుండి నిరసనలు వెల్లువెత్తనున్నాయి. ఊరూ రా నిరసనల కు శ్రీకారం చుట్టింది. 11వ తేదీన ఢిల్లీలో పోరాటం చేయనున్నారు. 4వ తేదీన మండల కేంద్రాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ పోరాటానికి శ్రీకారం చుట్టబో తున్నారు. 6న జాతీయ రహదారుల పై రాస్తా రోకో నిర్వస్తున్నారు. 7 న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పూనుకుంది. 8వ తేదీన గ్రామాల వారీగా పెద్ద ఎత్తున నిరసనలకు శ్రీకారం చుట్టనున్నారు. రైతు ఇళ్లపై నల్ల జెండాలు ఏర్పాటు చేసి నిరసన చెప్పాలని తెరాస నిర్ణయించింది. అదే రోజు మున్సిపాలిటీలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈనెల 11 వ తేదీన ఢిల్లీ లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయనున్నారు.  వారం రోజులపాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

కేంద్ర..రాష్ట ప్రభుత్వా ల కాంగ్రెస్..

- Advertisement -

పెట్రో ఛార్జీలు…విద్యుత్తు చార్జీల పెంపు ను నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పోరుకు సిద్దమైంది. మూడు రోజులపాటు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగనున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మీరకు నిరసనలకు శ్రీకారం చుట్టనున్నారు. 4వ తేదీన మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసించనున్నాయి. 6న జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. 7న హైదరాబాద్ లో విద్యుత్తు సౌద వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకుంది. అదే రోజు పౌరసరఫరాల శాఖ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నారు. ఎందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఒక పైపు అధికార తెరాస…మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలు చేపట్టనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement