Saturday, May 11, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు…!!

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఏంటో కొత్తగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహిళలకు బంగారానికి ఉన్న మక్కువ చాలా ఎక్కువ. అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు….తాజాగా మరోసారి పెరిగాయి. ఇక పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు చూసుకుంటే… 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.49,970 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76,100 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement