Thursday, April 25, 2024

వైష్ణవ్ తేజ్ కు ఆ హీరోయిన్ అంటే ఇష్టమట!!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మరోవైపు వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక త్వరలో గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అభిమానులతో టచ్ లోకి వచ్చిన వైష్ణవ్ తేజ్ కాసేపు ముచ్చటించారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీ గా సమాధానాలు చెప్పారు.

క్రికెట్ అంటే చాలా ఇష్టమని అలాగే ధోని అంటే ఇంకా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. సినిమాల విషయానికొస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని హీరోయిన్స్ లో నజ్రియా నజీమ్ అంటే ఇష్టమని అన్నారు. ఇక మామయ్య పవన్ కళ్యాణ్ నటించిన బద్రి ,తమ్ముడు, ఖుషి సినిమాలంటే చాలా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement