Monday, April 29, 2024

Gold Price Today : నేటి బంగారం, వెండి ధ‌ర‌లు ఇవే… హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

ఇటీవలి కాలంలో బంగారాన్ని పెట్టుబడి సాధనంగానూ ఉపయోగిస్తున్నారు. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో బంగారం రేటు ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 56 వేల 300 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం హైదరాబాద్‌లో తులానికి రూ.61 వేల 420 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.56 వేల 450 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 61 వేల 570 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం దారిలోనే కొనసాగుతూ ఇవాళ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 79 వేలు పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలోకు రూ.75 వేల 300 మార్క్ వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement