Sunday, May 5, 2024

జిన్నా చిన్న‌నాటి స్నేహితురాలిని నేనే- స‌న్నీలియోన్ పోస్ట‌ర్ రిలీజ్

నేను జిన్నా చిన్న‌నాటి స్నేహితురాలిని ..కానీ నేను అత‌ని జీవితాన్ని తలకిందులు చేయనని కాదు.. ఊహించని మలుపులు, ట్విస్టుల‌తో ఈ ప్ర‌యాణం క్రేజీగా ఉండబోతోంద‌ని స‌న్నీలియోన్‌ ట్వీట్ చేసింది.కాగా జిన్నా చిత్రం నుండి స‌న్నీలియోన్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో హీరోగా మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ , స‌న్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రేణుక అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తోంది స‌న్నీలియోన్‌. ఈ భామ రోజ్ క‌ల‌ర్ మినీ స్క‌ర్ట్‌, వైట్ టాప్ లో ఉన్న స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ప‌ల్లెవెలుగు బ‌స్సు దిగుతోంది. మోడ్ర‌న్ డ్రెస్‌లో ఇలా ఆర్‌టీసీ బ‌స్సులో నుంచి దిగుతూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తోంది స‌న్నీ. తాజా పోస్ట‌ర్ సినిమాపై క్యూరియాసిటీని, అంచ‌నాల‌ను అమాంతం పెంచేస్తుంది. జిన్నా చిత్రాన్ని హోం బ్యాన‌ర్ ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. రేణుకను మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాన‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement