Saturday, May 4, 2024

ఇప్పుడే ‘గని’ రాడట.. భీమ్లా నాయక్​ రాకతో వాయిదా..

మెగా హీరో వరుణ్ తేజ్ ప్ర‌దాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా గ‌ని.. స్పోర్ట్స్​ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.. అయితే ఈ సినిమా ఈ నెల 25న థియేటర్ల‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్ చెప్పింది గని చిత్రయూనిట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కాంబినేష‌న్ లో వస్తున్న భీమ్లా నాయక్ కూడా అదే రోజు విడుదల కాబోతుండడంతో గని చిత్రం రిలీజ్ డేట్‏ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది.

‘‘కష్ట సమయంలో మాకు బాసటగా నిలిచిన వారందరి ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఈనెల 25న రాబోతుంది. ఈ క్రమంలో మా సినిమా వాయిదా వేసుకున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాము’’ అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా వివరాలు తెలిపింది మూవీ టీమ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement