Monday, April 29, 2024

ఇంట్లోనే గంజాయి మొక్క‌లు .. గుట్టు ర‌ట్టు చేసిన పోలీసులు ..

గంజాయికి అల‌వాటు ప‌డిన ఓ యువ‌కుడు ఏకంగా ఇంట్లోనే మొక్క‌ల పెంప‌కాన్ని ప్రారంభించారు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ ల‌క్డికాపూల్ లో చోటు చేసుకుంది. మ‌హ్మ‌ద్ ఆరీఫ్ అనే యువ‌కుడు న‌గ‌రంలో బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు.దాంతో ఇటీవల గంజాయి లభించికపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్న ఆరీఫ్ దీన్ని అధిగమించేందుకు ఏకంగా తన ఇంటి పెరడులో గంజాయి మొక్కలను నాటాడు. కాగా ఆ మొక్కలు పెరిగిన తర్వాతా తానే వాడుకునేందుకు ప్లాన్ వేశాడు. అయితే ఇంట్లో గంజాయి మొక్కల పెంపకంపై సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. మొక్కలను ధ్వంసం చేసి ఆరీఫ్ పై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement