Thursday, May 2, 2024

స‌ల్మాన్ కి దూరంగా ఉండ‌క‌పోతే.. రాఖీసావంత్ ను చంపేస్తాం

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి దూరంగా ఉండ‌క‌పోతే న‌టి రాఖీ సావంత్ ని చంపేస్తామ‌ని గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. స‌ల్మాన్ ఖాన్‌కు మ‌ద్ద‌తుగా నిలిచినందుకు త‌న‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి లేటెస్ట్ మెయిల్‌లో హెచ్చరించార‌ని రాఖీ సావంత్ వెల్ల‌డించింది. స‌ల్మాన్‌కు దూరంగా ఉండాల‌ని బిష్ణోయ్ గ్యాంగ్ త‌న‌ను హెచ్చ‌రించింద‌ని ఆమె పేర్కొన్నారు. పంజాబీ సింగ‌ర్ సిద్ధూ మూసేవాలాను ఇదే ముఠా హ‌త్య చేయ‌గా స‌ల్మాన్ ఖాన్‌కు సైతం ప్రాణ‌హాని త‌ల‌పెడ‌తామ‌ని ప‌లుమార్లు బెదిరించింది. మీడియాతో రాఖీ సావంత్ మాట్లాడుతున్న వీడియోను న‌టి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. త‌న‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంపిన బెదిరింపు మెయిల్‌ను మీడియా స‌మ‌క్షంలో ఆమె బిగ్గ‌ర‌గా చ‌దువుతుండ‌టం ఈ వీడియోలో క‌నిపించింది. స‌ల్మాన్ ఖాన్ గురించి నువ్వు మాట్లాడితే నిన్ను చంపేస్తామ‌ని బిష్ణోయ్ గ్యాంగ్ త‌న‌ను బెదిరించింద‌ని ఆమె చెప్పుకొచ్చారు. త‌న త‌ల్లి అనారోగ్యానికి గురైన స‌మ‌యంలో స‌ల్మాన్ ఆమెకు సాయం చేశాడ‌ని, అందుకే తాను స‌ల్మాన్ గురించి మాట్లాడ‌తాన‌ని రాఖీ సావంత్ తెలిపింది. త‌న త‌ల్లిని క్యాన్స‌ర్ నుంచి కాపాడేందుకు స‌ల్మాన్ రూ. 50 ల‌క్ష‌లు వెచ్చించార‌ని గుర్తుచేశారు. తాను స‌ల్మాన్ గురించి ఎందుకు మాట్లాడ‌కూడ‌ద‌ని ఆమె నిల‌దీశారు.దాంతో ఈ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement