Friday, May 3, 2024

రాకీ భాయ్ స్టైల్ లో గ‌ణేశుడు-ఫైర్ అవుతోన్న నెటిజ‌న్స్

కేజీఎఫ్ మూవీలో రాకీ భాయ్ స్టైల్ లో గ‌ణేశుడి విగ్ర‌హాలు త‌యారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ విగ్రహాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్‌లో అక్రమ బంగారు మైనింగ్ సామ్రాజ్యాన్ని పాలించే స్మగ్లర్‌గా రాకీ నటించాడు. ‘గణపతిని స్మగ్లర్, క్రిమినల్‌గా చూపించడం ఎంతవరకు సబబు.. అంటూ ట్వీట్ చేస్తున్నారు. ‘పుష్ప, కేజీఎఫ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించినా.. ఆ సినిమాల్లో హీరోలు నేరస్థులుగా నటించారు. మరి గణపతిని నేరస్థుడిగా ఎందుకు చూపించారు.. అని ప్రశ్నిస్తున్నారు. లార్డ్ గణేష్ భారీ మెషిన్ గన్‌తో కేజీఎఫ్ మూవీలో యష్ తరహాలో సిగ్నేచర్ వైట్ పిన్‌స్ట్రిప్డ్ సూట్‌ను ధరించాడు. గణేశుడు మెషిన్ గన్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు ఉంది ఆ విగ్రహం. దాని కింద KGF-2 అని రాసిఉంది. ఈ సినిమాల్లోని పాత్రలకు వినాయకుడికి సంబంధం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement