Sunday, April 28, 2024

క్రీడాకారుల జీవితాల‌తో ఆట‌లా? : నారా లోకేశ్

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ పేద క్రీడాకారుల జీవితాల‌తో ఆట‌లాడుతుంద‌ని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్).. పేద క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్థ‌లం లేకుండా పోయింద‌ని, అందుబాటులో ఉన్న గ్రౌండ్స్ ను శాప్‌ ప్రైవేట్ వ్యక్తులను లీజుకు ఇవ్వడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శాప్ ఆధ్వర్యంలోని 52 బ్యాడ్మింటన్, 10 టెన్నిస్ కోర్టులు, 4 స్కేటింగ్ రింగులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి పేద క్రీడాకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. దీంతో చాలా మంది క్రీడాకారులు క్రీడ‌ల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. రాష్ట్రం క్రీడ‌ల్లో వెనుక‌బ‌డే ప్ర‌మాదం ఉంద‌న్నారు. శాప్ లో అర్హత, క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకుని అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరాలు పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement