Sunday, May 5, 2024

కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సీఎం కేసీఆర్ ఉన్నంత వ‌ర‌కు వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. పేద ప్ర‌జ‌ల‌కు అందించే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్ర‌లు చేస్తుంద‌ని నిప్పులు చెరిగారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ అందించ‌డం కేంద్రానికి కంట‌గింపుగా మారింద‌న్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. రాయితీ విద్యుత్ చార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే కేంద్రం నూత‌న‌ విద్యుత్ విధానం మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ ప‌రం చేయ‌డం కోస‌మే కేంద్రం ఎత్తులు వేస్తుంద‌న్నారు. కేంద్రం ఫ్యూడ‌ల్ ఆలోచ‌న‌ల‌తో పేద‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుంద‌ని మంత్రి పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ‌ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే కేంద్రం దుర్మార్గమైన ఆలోచన చేస్తుంద‌న్నారు. ఉచిత విద్యుత్ ఆపేది లేద‌న్నారు. కేంద్ర నూతన విద్యుత్ విధానాన్ని వ్యతిరేకిస్తాం అని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement