Thursday, May 2, 2024

ఉస్మానియా వర్శిటీలో విద్యార్థినులకు ఉచిత క్యాంపస్‌ బస్సు సేవలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇటీవల ఉస్మానియా వర్శిటీ పరిధిలో ప్రారంభించిన సెంటినరీ ఉమెన్స్‌ హాస్టల్‌లోని విద్యార్థినులకు క్యాంపస్‌లో ఉచిత బస్‌ షటిల్‌ సేవలను వర్శిటీ వీసీ ప్రొ.డి.రవీందర్‌ బుధవారం ప్రారంభించారు. సమయానికి హాస్టల్‌ నుంచి తరగతులకు హాజరుకావడం కష్టతరంగా మారడంతో పాటు చాలా దూరం నడుచుకుంటూ రావాల్సి ఉండడంతో బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. ఎండవేడిమి నుండి కూడా ఉపశమనం కలుగుతోందన్నారు.

ఎంపిక చేసిన రూట్లలో బస్సులు తిరుగుతాయని, విశ్వ విశ్వాని ఎడ్యుకేషనల్‌ సొసైటీ రెండు బస్సులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వర్శిటీ రిజిస్ట్రార్‌ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement