Thursday, April 25, 2024

గూగుల్‌కు రూ.4,415 కోట్ల జరిమానా

గూగుల్ సంస్థకు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో 500 మిలియన్ యూరోలు ఫైన్ విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. భారత కరెన్సీలో జరిమానా విలువ రూ.4,415 కోట్లుగా ఉంది. ఇప్పటికే పలు దేశాలు డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జరిమానాపై గూగుల్ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

మరోవైపు ప‌లు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగంపై ఉన్న ఆంక్ష‌లు, నిఘా వంటి అంశాల‌పై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పలు దేశాల్లో ఇంటర్నెట్ దాడికి గురవుతోందని, బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు ఇంట‌ర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురొడ్డాలని కోరారు. ఇంట‌ర్నెట్ వేదిక‌గా ఎలాంటి స‌మాచారాన్ని అనుమతించాలన్న దానిపై ఇప్పుడు ప్రతి దేశంలోనూ చర్చ జరుగుతోందన్నారు. ఇంట‌ర్నెట్‌లో సమాచార విస్తృతిని నిరోధించేందుకు చాలా దేశాలు ఇప్పుడు ఆంక్షలు విధించాయన్నారు. ఉచితంగా ఎలాంటి నియంత్ర‌ణ‌లు లేకుండా అందించే ఇంట‌ర్నెట్ మంచిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఇటువంటి వ్య‌వ‌హారాన్ని అడ్డుకోవడమంటే వెనక్కి వెళ్లడమేన‌ని తెలిపారు. తాను అమెరికా పౌరుడిని అయిన‌ప్ప‌టికీ త‌న‌లో భారతీయ మూలాలు బలంగా ఉన్నాయ‌న్నారు.

ఈ వార్త కూడా చదవండి: 132 శాతం పెరిగిన డీమార్ట్ లాభాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement