Tuesday, May 21, 2024

యూనివర్శిటీలకు పూర్వ వైభవం.. వర్శిటీల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ నియామకాలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని యూనివర్శిటీలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే వర్శిటీల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలిపారని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌ నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్‌ ఇండియా మ్యాగజైన్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ విజన్‌-పాలమూరు వర్శిటీ గ్రోత్‌పై బుధవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలమూరు యూనివర్శిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.60 కోట్ల నిధులను విడుదల చేశారన్నారు.

యూనివర్శిటీల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.లింబాద్రి, మాజీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, వర్శిటీ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, ఎక్సెల్‌ ఇండియా ఎడిటర్‌ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement