Thursday, April 25, 2024

Chennai: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి తమిళనాడు మాజీ సీఎం ..

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా కలిసి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ముఖ్యంగా సౌత్ బెల్ట్‌లో కాషాల జెండాను రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకేపై ఆయ‌న‌ను అస్త్రంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా రామ‌నాథ‌పురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌న్నీర్ సెల్వంను స్వ‌తంత్ర‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపాల‌ని బీజేపీ వ్యూహం ర‌చిస్తోంది. ఇందులో భాగంగా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిని కూడా పోటీలో దించ‌బోమ‌ని ప‌న్నీర్‌సెల్వంకు కాషాయ పార్టీ పెద్ద‌లు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement