Tuesday, May 7, 2024

ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు.. పది రోజుల్లో రూ.12 వేల కోట్లు పెట్టుబడులు

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో కేవలం పది రోజుల్లోనే రూ.12 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. గత కొంతకాలంగా విదేశీ పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఈక్విటీల్లో విదేశీ సంస్థల పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) పది రోజుల్లో రూ.12,190 కోట్లు పెట్టుబడులు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. మరోవైపు దేశీయ సంస్థల పెట్టుబడిదారులు(డీఐఐ) ఈ పది రోజుల్లో రూ.2,677 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి మారకం విలువ బలపడుతుండటం మంచి శుభపరిణామమని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ”ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఎఫ్‌పీఐ కార్యకలాపాల్లో పూర్తి విరుద్ధం. అక్టోబర్‌ 2021 నుంచి జూన్‌ 2022 వరకు ఇండియన్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐ భారీగా వైదొలగాయి.

జులైలో కొంత మార్పు రాగా, ఆగస్టులో అదే ఒరవడి కొనసాగింది. దీంతోనే ఈక్విటీల్లో విదేశీ సంస్థ పెట్టుబడిదారులు పెట్టుబడులు కొనసాగుతున్నాయి.” అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ డా. వీకే విజయ్‌కుమార్‌ వివరించారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇండియన్‌ మార్కెట్‌లో ఆశాజనక పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. జులై దాదాపు రూ.4,980 కోట్లు ఫారిన్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement