Friday, May 3, 2024

మూడోసారి ప్ర‌ధానిగా మోడీ..అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

2022 లో మరోసారి యోగి ఆదిత్యనాథే సీఎంగా బాధ్యతలు చేపడతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. అలాగే 2024 లో మోడీనే మూడోసారి ప్రధాని కానున్నారని కీలక ప్రకటన చేయ‌డం విశేసం. కాగా ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో త్వరలో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ కి జరిగే ఎన్నికల్లో ..బిజెపి విజయం సాధిస్తే సీఎం గా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఈ వార్త ను అమిత్ షా తోసిపుచ్చారు. ఆ వార్తల్లో ఎటు వంటి నిజం లేదన్నారు. యూపీ లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు 2022 లో పునాది పడాలన్నారు. దీపావళి తర్వాత ఎన్నికల హీట్ పుంజుకోనుందని కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం పని చేయాలని అమిత్ షా సూచించారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్ల లో గెలుపే టార్గెట్ గా పని చేయాలని ప‌లు కీలక సూచనలు చేశారు. కాగా మోడీ విదేశాల్లో ఉన్నారని ..ఇక్కడి వాయిస్ అక్కడికి చేరాలని అమిత్ షా తెలిపారు. దీపావళి రోజున ప్రతి ఇంటి లో ‘నా కుటుంబం-బీజేపీ కుటుంబం’ అంటూ ఆమోదం తెలపాలనే ప్రచారం కూడా మొదలయింది. ఉత్తర ప్రదేశ్ కు మళ్లీ గుర్తింపు తెచ్చేందుకు బీజేపీ కృషి చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement