Saturday, April 20, 2024

AP: సాగరతీరంలో సమరం.. రేపు పవన్‌ సంఘీభావ సభ.. ప్రజా ఉద్యమంగా విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇటీవలే కేంద్రం ప్రయివేటీకరించడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అలజడి రేపుతుంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేసినప్పటికి అప్పట్లో వేర్వేరు కారణాలుతో ముందుకు సాగలేదు. అయితే తాజాగా కేంద్రం మాత్రం ఉక్కు ప్రయివేటీకరణకు సంబంధించి దూకుడు పెంచింది.

ఇప్పటికే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌తో పాటు కీలకమైన డాక్యుమెంట్లను డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టింది. అయితే ఉక్కు ప్రయివేటీకరణను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఇలా అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాంట్‌ ప్రయివేటీకరణను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లిdలో సైతం తీర్మాణం చేయడం జరిగింది. అయినప్పటికి కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇదే సమయంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు 250 రోజులుకు పైగా నిరసన దీక్షలు చేపట్టాయి.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రేపు విశాఖ రానున్నారు. విమానాశ్రయం నుంచి పవన్‌కళ్యాణ్‌ భారీ ర్యాలీతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ జనసేన పార్టీ నేతలతో పాటు ఉక్కు ఉద్యమ నాయకులు, కార్మికులతో కలిసి సంఘీభావ సభలో పాల్గొం టారు. పవన్‌రాకతో జనసేన పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘీభావ సభకు భారీ ఎత్తున జనం వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

వీరికి సంఘీభావంగా అన్ని ప్రాంతాల్లోనూ సంఘీభావ దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కుటుంబాలు ఆదారప డి ఉన్న ఉక్కును ప్రయివేటీకరించుకునే అంశం కేంద్రం విరమించుకోవాలని వీరంతా కోరు తున్నారు. ఈ నేపధ్యంలోనే ఉక్కు ఉద్యమా న్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈరోజు జాతీయ ప్రజా ఉద్యమాల వేధిక కన్వీనర్‌ మేధాపాట్కర్‌, ఐఎఫ్‌టియూ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్‌ అపర్ణ విశాఖ రానున్నారు. పిఓడబ్ల్యూ, అరుణోద య, ఎమ్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ వంటి అనేక ప్రజా సంఘాలు భారీ ఎత్తున గాజువాక వేదికగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement