Friday, April 26, 2024

వెనిజులాను ముంచెత్తిన వరదలు.. 22 మంది మృతి, 50 మంది గల్లంతు

దక్షిణ అమెరికాలోని వెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్‌ టెజెరియాస్‌ నగరంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. 22 మంది మరణించగా, దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు కూలిపోయాయి. అధ్యక్షుడు నికోలస్‌ మదురో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడటం వల్లనే విధ్వంసం జరిగిందని నికోలస్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది.30 ఏండ్ల అనంతరం లాస్‌ టెజేరియాస్‌లోని అతిపెద్ద నది నీటి మట్టం అమాంతం పెరగడం వల్ల వరదలు సంభవించాయని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు 1999లో వర్గాస్‌ నగరంలో కొండచరియలు విరిగిపడి 10,000 మంది మరణించారు.

విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత లాస్‌ టెజేరియాస్‌ నగారంలో పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీవ్లును మోహరించారు. బొలివేరియన్‌ జాతీయ సాయుధ దళాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. కేవలం 8 గంటల్లోనే ఒక నెలలో కురిసిన వర్షం కురవడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని వెనిజులా వైస్‌ ప్రెసిడెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డెల్సీ రోడ్రిగ్జ్‌ విచారం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా నగరం శివారులోని ఐదు చిన్న నదులు పొంగిపొర్లుతున్నాయి. బాధితుల కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఆహారం, నివాసం ఏర్పాట్లు చేసింది. విద్యుత్‌ స్తంభాలు వరదలో కొట్టుకుపోవడంతో విద్యుత్‌ సరఫరా లేక చిమ్మ చీకట్లోనే ప్రజలు మగ్గుతున్నారు. తాగేందుకు నీరు లేక చాలా మంది అలమటిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement