Friday, April 26, 2024

క్షిపణులతో దద్దరిల్లిన కీవ్స్‌.. రష్యా చర్యను ఖండించిన ప్రపంచ దేశాలు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్స్‌ సోమవారం ఉదయం క్షిపణి దాడులతో దద్దరిల్లింది.ఈ దాడుల్లో 11 మంది మరణించినట్టు,50 మందిపైగా గాయపడినట్టు సమాచారం అందింది.అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.శనివారంనాడు క్రిమియానూ,రష్యానూ కలిపే వంతెనను రష్యన్‌ దళాలు పేల్చివేయడం వల్ల తమ సేనలు ఉక్రెయిన్‌ రాజధానిపై క్షిపణి దాడులు జరిపినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు.ఇది కవ్వింపుదాడి కాదు,ప్రతీకార దాడి అని ఆయన అన్నారు.కాగా,ఉక్రెయిన్‌ని నామరూపాలు లేకుండా చేయాలని రష్యా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనిస్కీ ఆరోపించారు.రష్యాజరిపిన దాడుల్లో చిన్న పిల్లలు,ఆడవారు ఎక్కువగా చనిపోవడమో,గాయపడట మోజరిగిందని ఆయన అన్నారు.ఈ దాడులతో ప్రజలు భయంతో వణికి పోయారని ఆయన అన్నారు.రష్యా జరుపుతున్న దాడుల్లో ఇది అత్యంత క్రూరమైనదని ఆయన అన్నారు.

రష్యా దాడులను అమెరికా ఖండించింది. పశ్చిమ దేశాలు కూడా ఖండించాయి.ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు అమానుషమని అమెరికా ఖండించింది.అంతేకాక, రష్యా చర్యయుద్ధ నేరం కిందికి వస్తుందని పేర్కొంది.రష్యా చర్యను పోలండ్‌ తదితర దేశాలుఖండించాయి.ఉక్రెయిన్‌ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పోలండ్‌ ప్రభుత్వం తమ దేశవాసులకు విజ్ఞప్తి చేసింది.కాగా, కీవ్స్‌లో జరిగిన తాజా క్షిపణి దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కి భారత పౌరులెవరూ వెళ్ళవద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement